జిల్లాలో గంజాయి, మత్తుపదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే పిడి యాక్ట్ నమోదు చేస్తాం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

ఈసంవత్సరం జిల్లాలో 41 గంజాయి కేసులు నమోదు, 83 మంది అరెస్ట్, 32 కిలోల 204 గ్రాముల గంజాయి స్వాధీనం

రాజన్న సిరిసిల్ల, 9 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): సిరిసిల్ల టౌన్ పోలీసులు సిరిసిల్ల పాత బస్టాండ్ ప్రాతంలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ చేసి 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ గారు సోమవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు. నిందుతుని వివరాలు. Prasanjit Ray s/o Tapan Ray, 26 years, Occ: Labor r/o H.No M.V-49, Kamwada, Malkangiri of Odish. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఒడిశా రాష్ట్రానికి చెందిన Prasanjit Ray అనే వ్యక్తి సోమవారం రోజున మధ్యాహ్నం 1 గంటల సమయంలో సిరిసిల్ల పాత బస్  స్టాప్ వద్ద  ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని అనుమానాస్పదంగా తిరుగుతూ పొలిసు వారిని  చూసి అక్కడి నుండి పారిపోవుటకు ప్రయత్నించగా అతడిని పట్టుకొని తనిఖీ చేయగా అతని షోల్డర్ బ్యాగులో 4కిలోల  గంజాయి ఉండగా అట్టి గంజాయి స్వాధీనం చేసుకొని అట్టి వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా గత కొద్దీ రోజులుగా ఒడిశా రాష్ట్రం నుండి హైదరాబాద్ కు వివిధ మార్గాల ద్వారా బస్సు లో తరలిస్తున్నాడాని తేలుపగ అట్టి వ్యక్తిని రిమాండుకు తరలించడం జరిగింది. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహిస్తు ముందుకు సాగుతుంది అన్నారు.వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని,జిల్లా పరిధిలో తరచు గంజాయి అక్రమ రవాణా,విక్రయాలు జరిపితే కేసులు నమోదు చేయడంతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. గంజాయి మత్తులో ఎంతో మంది యువత వారికి తెలియకుండానే నేరాలకు పాల్పడి జైలుజీవితం గడుపుతున్నారు.గంజాయి,మత్తు పదార్థాలకు అలవాటు పడి యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు.గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ కి లేదా డయల్100 కు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో ఈ సంవత్సరం అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న,సేవిస్తున్న వారిని గుర్తించి 41 కేసులు నమోదు చేసి 83 మందిని అరెస్ట్ చేసి 32 కిలోల 204 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post