బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే కార్యక్రమం: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Posted by Chief Editor DAYANAND JANA

గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు స్వీకరణ

రాజన్నసిరిసిల్ల, 09 అక్టోబర్ (జనవిజన్ న్యూస్) :
ప్రజల వద్ద నుండి పిర్యాదులు స్వీకరించి ప్రతి పిర్యాదుపై స్పందించి బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా గ్రీవెన్స్ డే ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుండి 03:00 గంటల వరకు జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమావారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని,అందులో భాగంగా ఈ రోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమనికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 13 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ తగాదాలు,ఆస్థి తగాదాల విషయంలో చట్ట ప్రకారం, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని సూచించారు.గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందిస్తున్నామన్నారు.  ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్థుల పట్ల కఠిన వైఖరి అవలంభిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post