సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ దంపతులు.
సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ ఉత్సవాలు నేడు అత్యంత ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని మహిళ పోలీస్ అధికారులు, పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు తోసహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ బతుకమ్మ ఉత్సవాలలో పోలీస్ మహిళా అధికారులతో సహా అన్ని స్థాయిల్లోని మహిళా ఉద్యోగులు, పోలీస్ కుటుంబ సభ్యులు అత్యంత ఉత్సాహంతో పాల్గొన్నారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళా ఉద్యోగులు, వారి పిల్లలు, చిన్నారులతో ఒక చోట ఉంచి ఆటపాటలతో సంబరాలు చేసారు. దాండియా, బతుకమ్మ ఆటపాటల మధ్య జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాలలో మహిళ పోలీస్ అధికారులు,కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ బతుకమ్మ వేడుకల్లో ముఖ్య అతిధిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ.... దేవి నవరాత్రిలతో మహిళలను శక్తి రూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనలో ఉందని అన్నారు. పూలనే దేవుడిలా భావిస్తూ బతుకమ్మ ఉత్సవాలు జరపడం కేవలం మన రాష్ట్రంలోనే ఉందని పేర్కొన్నారు. పండగ వాతావరణంలో తీరొక్కపూలతో కలర్ ఫుల్ గా ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.