రేపటి నుంచే దసరా సెలవులు..

Input Editor Dayanand Jana
హైదరాబాద్‌,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్స్‌కి ఈ నెల 13వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

పండుగ తరువాత అంటే 26వ తేదీన స్కూల్స్ తిరిగి ఓపెన్ అవుతాయి. స్కూల్స్‌లో సమ్మెటివ్ ఎగ్జామ్స్, SA1, నిన్నటితోనే ముగియగా.. ఇవాళ ఒక్క రోజు స్కూల్ ఉంటుంది. మరుసటి రోజు నుంచి అంటే శుక్రవారం నుంచి సెలవులు ఉంటాయి.

ఇక ఫలితాలను స్కూల్స్ పునఃప్రారంభం అయిన తరువాత ప్రకటిస్తారు. జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరాలు సెలవు ప్రారంభం కానుంది. 19వ తేదీ నుంచి 26వ తేదీ వరకు వారికి ఈ సెలవులు ఉంటాయి.

ఆ తరువాత రోజు నుంచి యధావిధిగా తరగతులు ప్రారంభం అవుతాయని రాష్ట్ర విద్యాశాఖ వెల్లడించింది.

Post a Comment

Previous Post Next Post