వేములవాడ,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న చల్మెడ లక్ష్మీ నరసింహా రావుకు కథలపూర్ మండలం బొమ్మేన గ్రామానికి చెందిన మహిళలు ఎన్నికల నామినేషన్ వేసేందుకు డిపాజిట్ రూ. 10వేల నగదు అందించారు. బి.ఆర్.ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థికి డిపాజిట్ నగదు అందించడం ఆనవాయితీగా వస్తుందని, గతంలో ఇదే వేదికగా ప్రస్తుత వేములవాడ శాసనసభ్యులు రమేష్ బాబుకి సైతం అందించామని తెలిపారు. తమ ఆశీర్వాదంతో చల్మెడ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని అన్నారు.
Tags
vemulawada