కారులో తరలిస్తున్న లక్ష రూపాయల నగదు పట్టివేత

Input Editor Dayanand Jana
రాజన్న సిరిసిల్ల,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): రాష్ట్రంలో ఎన్నికల కొడ్ అమలులో ఉన్నందున సరిహద్దుల వద్ద అధికారులు వాహనాల తనిఖి ముమ్మరం చేశారు. కామారెడ్డి నుండి కరీంనగర్ వెళ్తుండగా చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్న ఫ్లయింగ్ స్క్వాడ్. లక్ష రూపాయల నగదు సీజ్ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల - కామారెడ్డి రెండు జిల్లాల సరిహద్దుల్లో పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద KA 27M 9264 అనే నంబర్ గల కారు లో కామారెడ్డి నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును పెద్దమ్మ చెక్ పోస్ట్ వద్ద ఆపి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందము ఆపి తనికే చేయగా కారులో ఉన్న సయ్యద్ ఖలీమొద్దిన్ వద్ద నుండి లక్ష రూపాయల నగదును పట్టుకున్నారు. స్వాదీనం చేసుకున్న నగదును జిల్లా ట్రెజరీ కార్యాలయంకు అప్పగించినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post