ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి

Posted by Chief Editor Dayanand Jana
రాజన్న సిరిసిల్ల,10 అక్టోబర్(జనవిజన్ న్యూస్): అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో జిల్లాలోని ఫ్లయింగ్ స్క్వాడ్ లు అప్రమత్తంగా ఉంటూ మోడల్ కోడ్ ఉల్లంఘనలపై స్పందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి సూచించారు. మంగళవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను నిక్కచ్చిగా అమలు పై ఫ్లయింగ్ స్క్వాడ్ బృంద సభ్యులతో కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ నందు సమావేశం నిర్వహించారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిష్పక్షపాతంగా , పారదర్శంగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. మోడల్ కోడ్ ఉల్లంఘన సమయంలో సీజ్ చేసేటప్పుడు కచ్చితంగా పంచనామా చేయాలన్నాడు. ఆ ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేయాలన్నారు .
సి విజిల్ సహా ఇతర ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, చేనేత జౌళి జిల్లా అధికారి సాగర్, జిల్లా లేబర్ అధికారి రఫీ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post