బీహార్ లో ఘోర రైలు ప్రమాదం.. చెల్లాచెదురైన బోగీలు

Posted by Input Editor Dayanand Jana
బక్సర్,12 అక్టోబర్(జనవిజన్ న్యూస్): బిహార్ లోని బక్సర్ సమీపంలో నిన్న రాత్రి నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పడంతో బోగీలు చెల్లాచెదురయ్యాయి. మొత్తం 21 కోచ్లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.

రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్.. ఢిల్లీలోని ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి గౌహతిలోని కామాఖ్య జంక్షన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Post a Comment

Previous Post Next Post