తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ

తిరుమల, 10 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చన‌ సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున ఆమె సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం తిరుమల శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. వైసీపీ MLA, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు చేరుకున్న కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉదయం తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని సీఎం సతీమణి శోభ శ్రీవారిని కోరుకున్నట్టు తెలిసింది.

Post a Comment

Previous Post Next Post