హైదరాబాద్, 9 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ప్రజలు 50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లాలంటే ప్రూఫ్స్ ఉంచుకోవాలి. ఆస్పత్రి చెల్లింపుల కోసమైతే రోగి రిపోర్టులు, శుభకార్యాల కోసమైతే సంబంధిత ఆధారాలు తప్పనిసరి. వస్తువులు, ధాన్యం లేదా భూమి విక్రయిస్తే బిల్స్, డాక్యుమెంట్స్ చూపించాలి. లేదంటే పోలీసులు సీజ్ చేస్తారు. ఎన్నికలు ముగిశాక ఆధారాలు చూపితే తిరిగి ఇస్తారు.
Tags
2023 ఎన్నికలు