రేషన్ పంపిణీకి సర్వర్ సమస్య.. ముందుకు సాగని రేషన్ సరుకుల పంపిణీ



8 రోజుల్లో తక్కువ కార్డులకే పంపిణీ.. ఆపరేటర్ల నిరసన

అమరావతి 9 అక్టోబర్ (జనవిజన్ న్యూస్): గత వారం రోజులుగా రేషన్ పంపిణీ సాగుతున్నా సగం మందికి కూడా సరుకులు అందించలేకపోయారు. కేవలం మూడవ మందికి పంపిణీ చేశారు. పౌరసరఫరాల శాఖలో సర్వర్లు మొరాయిస్తుండడంతో రేషన్ సరుకులు పంపిణీ సజావుగా సాగడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,48,06,949 మంది కార్డుదారుల ఉన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి 8 తేదీ వరకు 48,88,841 మంది కార్డుదారులకు మాత్రమే రేషన్ సరుకులు ఎండియు పంపిణీ చేశారు. ఇంకా 98 లక్షల మందికి పైగా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఎండియు (మొబైల్ డిస్ప్లేన్సింగ్ యూనిట్) ఆపరేటర్లు రేషన్ డీలర్ నుంచి రోజు ఉదయం బియ్యం పంచదార బస్తాలు తీసుకొని కార్డుదారులకు పంపిణీ చేసేందుకు ఇంటింటికి వెళ్తున్నారు. సర్వర్ల సమస్యతో ఈపాస్ యంత్రాలు పనిచేయకపోవడంతో లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకోవడానికి నానా పాటలు పడాల్సి వస్తుంది. కార్డుదారుల నుంచి రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి రావడంతో ఎక్కువ సమయం వృధా అవుతుంది అని ఆపరేటర్లు వాపోతున్నారు. ఈనెల అక్టోబర్ రేషన్ సరఫరాకు ఈపాస్ యంత్రాలు సరిగా పనిచేయకపోవడంతో వారం రోజులుగా ఇబ్బంది పడుతున్నారు వేలిముద్రలు తీసుకొని సరుకులు ఇవ్వడానికి గంటల తరబడి లో నిలబడుతున్నారంటూ కార్డుదారులు ఎండిఓ ఆపరేటర్లతో వాదనకు దిగుతున్నారు కొన్నిచోట్ల దుర్భిషలాడుతూ తమపై భౌతిక జాడలు దిగుతున్నారంటూ ఎండి ఆపరేటర్ల వాపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 9,260 వాహనాలు ఉన్నాయి ఒక్కొ వాహనికి సగటున 1500 నుంచి 2500 కుటుంబాలకు సరుకులు అందజేస్తారు ఆన్లైన్ విధానంలో ఈపాస్ యంత్రాల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు తీసుకొని వారికి రేషన్ సరుకులను అందజేస్తున్నారు. అయితే కొత్త కొన్ని నెలలుగా ఆన్లైన్లో సర్వళ్లు మురాయిస్తుండడంతో ఈ పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయడం లేదని, సమయం చూస్తే ఇక వారం రోజులే మిగిలింది. పైగా దసరా దగ్గర పడడంతో రేషన్ సరుకులు తీసుకోవడానికి కార్డుదారులు ఎగబడుతున్నారు. ఘర్షణలు కూడా చోటుచేసుకున్నాయి.

ఆ విధానాన్ని తొలగించాలి ఆపరేటర్ల సంఘం

ప్రతి కార్డుదారుడికి నుంచి రెండుసార్లు వేలిముద్రలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేయడంతో తమపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. దానికి తోడు సర్వర్ సమస్య వేధిస్తున్నాడంతో సరుకుల పంపిణీ ఆలస్యం అవుతుందని ఎండిఓ ఆపరేటర్లు వాపోతున్నారు. ఈ విధానాన్ని తొలగించాలని ఎండి ఆపరేటర్లు కోరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post