రేపటి (సోమవారం)ప్రజావాణి రద్దు: ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రేపటి (సోమవారం)ప్రజావాణి రద్దు: ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
------------------------------------------
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ - 21
-------------------------------------------

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో రేపు(సోమవారం) ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నందున అధికార యంత్రాంగం ఆయా పనులలో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post