డిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సంగీతం శ్రీనివాస్
రాజన్నసిరిసిల్ల, 25 నవంబర్ 2025:
కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన సంగీతం శ్రీనివాస్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి మాజి అధ్యక్షులు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంగీతం శ్రీనివాస్ కు బాధ్యతలు అప్పగించారు. మొదటగా డిసిసి కార్యాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్వ అధ్యక్షులు అది శ్రీనివాస్ ను సంగీతం శ్రీనివాస్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆది శ్రీనివాస్ సంగీతం శ్రీనివాస్ కు మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. తదనంతర కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొని సంగీతం శ్రీనివాసరావు శాలువాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. పిసిసి ఆదేశాలను అనుసరించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని సంగీతం శ్రీనివాస్ కు కోరారు. అన్ని వర్గాలను కలుపుకుపోతూ, పార్టీ అభివృద్ధికి పాటు పాడాలని అన్నారు. ఇప్పటివరకు తనకు సహకరించిన మంత్రులకు ఎమ్మెల్యేలకు జిల్లాలోని నాయకులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి నూతన అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న తనను గుర్తించి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టిన పీసీసీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. అన్ని వర్గాల సహకారంతో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తానని తెలిపారు. కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, సిరిసిల్ల బ్లాక్ అధ్యక్షుడు సుర దేవరాజు, ఎల్లారెడ్డిపేట బ్లాక్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, ఎల్లారెడ్డిపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వేములవాడ బ్లాక్ అద్యక్షుడు సాగరం వెంకటస్వామి, వేములవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వేములవాడ అర్బన్ అధ్యక్షుడు పిల్లి కనకయ్య, వేములవాడ రూరల్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, జిల్లా ఆర్టిఎ మెంబర్ సంగీతం శ్రీనాథ్, యూత్ కాంగ్రెస్ సిరిసిల్ల టౌన్ మాజీ అధ్యక్షుడు చిందం శ్రీనివాస్, మైనార్టీ నాయకులు రియాజ్, హైమద్, ఎస్సీ సెల్ నాయకులు ఆకునూరి బాలరాజు, నాలుక సత్యం, మంగ కిరణ్, మహిళ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు మడుపు శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.