కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ నియామకం

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్ నియామకంక్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ హై కమాండ్ దృష్టి సారించిన దరిమిల జిల్లా అధ్యక్ష పదవుల నియామకం చేపట్టింది. జిల్లా అధ్యక్ష పదవి పోటీలో ఉండే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల గూర్చి దరఖాస్తు చేసే ముందే తెలియపరిచింది. ఈ నేపథ్యంలో శనివారం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, తెలంగాణలోని జిల్లాలలకు అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధ్యక్ష నియామకంపై పలు ఊహగానాలు తెరపైకి వచ్చాయి. సామాజిక వర్గాల వారీగా, సీనియారిటీ పరంగా జిల్లా అధ్యక్ష పదవి ఉండబోతుందంటూ ఇలా రకరకాల ఊహాగానాలు, గుసగుసలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొట్టాయి. చివరికి జిల్లాలో సీనియర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్న సంగీతం శ్రీనివాస్ ను జిల్లా అధ్యక్ష పదవి వరించింది. సంగీతం శ్రీనివాస్ 1982 నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలో ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జిల్లా స్థాయి లో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 2005లో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి సంగీతం శ్రీనివాస్ పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సిరిసిల్ల పట్టణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి పది సంవత్సరాలు సిరిసిల్లలో పార్టీ ఉనికిని చాటి చెప్పారు. 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టి కేసులను ఎదుర్కొంటున్నారు. 2023 సాధారణ ఎన్నికల నేపథ్యంలో చొప్పదండి నియోజకవర్గానికి ఎల్ డి ఎం గా సేవలందించి చొప్పదండి ఎమ్మెల్యే గెలుపునకు కృషి చేశారు. 2023 జనరల్ ఎలక్షన్ సందర్భంగా టికెట్ ఆశించి పట్టణ అధ్యక్ష పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, టిపిసిసి కోఆర్డినేటర్ గా నియామకమై, పెద్దపల్లి జిల్లా పరిశీలకులలో ఒకడిగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే ఆలోచనతో హై కమాండ్ అన్ని విధాలుగా అర్హతలు కలిగిన సంగీతం శ్రీనివాస్ కు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది.

Post a Comment

Previous Post Next Post