గోవా టూర్ కు బయల్దేరిన సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్
టిజీఎస్ఆర్టీసీ సిరిసిల్ల బస్ డిపో నుండి డిలక్స్ బస్ నాలుగు రోజుల గోవా టూర్ ను డిపో మేనేజర్ ప్రకాశ రావు అధ్వర్యంలో శనివారం పట్టణంలోని సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి ప్రయాణికులతో కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ.. మురుడేశ్వర్, గోకర్ణ, గోవా, పండరీపూర్, తుల్జాపూర్, గానుగాపూర్, బీదర్ లోని నరసింహస్వామి ఆలయాల దర్శనం నిమిత్తం సిరిసిల్ల డిపో నుండి డీలక్స్ బస్ ను ఏర్పాటు చేసి శనివారం సాయంత్రం 4.00 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి ప్రారంభించామని తెలిపారు. మంగళవారం రాత్రికి సిరిసిల్ల కు చేరుకోనున్నట్లు డిఎం తెలిపారు. ప్యాకేజీ లో ఒక్కరికి ఛార్జీ రూ. 3900/- రూపాయలు నిర్ణయించడం జరిగిందని డిపో మేనేజర్ ప్రకాశ రావు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం అతి త్వరలో ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం, అయోధ్య, కాశి, రామేశ్వరం, భద్రాచలం, ఈ దర్శనాలతో పాటు ప్రయాణికులు కోరుకున్న విధంగా కూడా ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు తమ ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించాలని తెలిపారు.
9959225929, 6304171291,
9063403778, 9440009059, 9063152130
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ వర్జిలాల్, ట్రాఫిక్ ఇంచార్జి బాపురెడ్డి, ఏడీసీలు ఆనందం శ్రీనివాసరావు, పాపారావు, టెంపుల్ టూర్ ప్యాకేజ్ ఇంచార్జ్ సంతోష్ నాయక్, ఆర్టీసీ ఉద్యోగులు, సిరిసిల్ల కొత్త బస్టాండ్ అభివృద్ధి కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.