రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
అందుబాటులో సీసీఐ కొనుగోలు కేంద్రాలు

పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతు సంబంధిత పథకాలకు లక్ష కోట్లకు పైగా వ్యయం

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

అందుబాటులో సీసీఐ కొనుగోలు కేంద్రాలు

పత్తి రైతులు సద్వినియోగం చేసుకోవాలి

రైతు సంబంధిత పథకాలకు లక్ష కోట్లకు పైగా వ్యయం

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

వేములవాడ, కోనరావుపేట మండలాల్లో మూడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

------------------------------------
వేములవాడ/ కోనరావుపేట, నవంబర్ - 03
------------------------------------

రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ అర్బన్ మండలం నాంపల్లిలోని లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలోని లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్ సీసీఐ కొనుగోలు కేంద్రాలను సోమవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. జిల్లాలోని పత్తి రైతులకు ఇబ్బందులు కలుగకుండా, మద్దతు ధర వచ్చేలా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మాట్లాడడంతో స్థానికంగా సీసీఐ కొనుగోలు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.

జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో ఐదు జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని, వేములవాడ పరిధిలో రెండు, కోనరావుపేట మండలంలో ఒకటి, ఇల్లంతకుంట మండలంలో రెండు ఉన్నాయని తెలిపారు. రైతులు తమ సమీపంలోని ఆయా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయించి మద్దతు పొందాలని పిలుపు నిచ్చారు.పత్తి నాణ్యత ఆధారంగా క్వింటాలుకు రూ. 7689 నుంచి 8110 మద్దతు ధర ఉందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. 20 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ. లక్ష కోట్లకు పైగా రైతు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చించిందని వెల్లడించారు. 20 వేల కోట్లకు పైగా రుణమాఫీ రైతులకు చేసిందని తెలిపారు. సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాలకు అదనంగా రూపాయల 500 అందజేస్తుందని వివరించారు. ఇప్పటికే జిల్లాలోని ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు దాన్యం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.


ఈ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని కాలువలు ఇతర పనులు పూర్తి చేసేందుకు దాదాపు 300 కోట్లు పైగా ప్రజా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం శంకుస్థాపన చేశారని, పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.


ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ఈ ఏడాది 46 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, జిల్లాలో 5 లక్షలకు పైగా క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని తెలిపారు. *కపాస్ కిసాన్*లో రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. సీసీఐ, మార్కెటింగ్, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో 
రైతులకు వసతులు కల్పించాలని ఆదేశించారు.


కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్లు రొండి రాజు, కచ్చకాయల ఎల్లయ్య, వేములవాడ ఆర్డీవో రాధాభాయ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రకాష్, సీసీఐ సీపీఓ రఘురామ్ తహసీల్దార్లు విజయ్ ప్రకాశ్ రావు, వరలక్ష్మీ, ఎంపీడీఓలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post