ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇండ్లపై ఎంపీడీవోలు రోజు సమీక్ష చేయాలి
ఎంపీడీఓలు పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

---------------------------------------
రాజన్నసిరిసిల్ల, నవంబర్ - 11
---------------------------------------

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై ఎంపీడీవోలు ప్రతి రోజు సమీక్ష చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై జిల్లాలోని జడ్పీ సీఈవో, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు ఇతర శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, పీడీ హౌసింగ్ తో కలిసి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

సొంత ఇంటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని, దీనిలో భాగంగా లబ్ధిదారులకు నాలుగు విడతల్లో రూ. 5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేస్తున్నదని తెలిపారు. 

ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మహిళా సంఘాల సభ్యులకు డీఆర్డీఓ, మెప్మా నుంచి ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. ఇసుక ఇబ్బందులు ఉంటే తహసీల్దార్లతో ఆయా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు మాట్లాడాలని ఆదేశించారు. తమ పరిధిలోని రీచ్ ల నుంచి ఇసుక తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఎంపీడీవో తమ పరిధిలోని పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై రోజు టెలీ కాన్ఫరెన్స్ చేయాలని సూచించారు. పీడీ హౌసింగ్, మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఏఈలు తమ మండలాల్లో ఇండ్ల నిర్మాణాల పురోగతి పరిశీలించాలని ఆదేశించారు. 

హౌసింగ్, ఇతర అధికారులు తమ పరిధిలో ఇండ్ల ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలని, పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించేం దుకు సిద్ధం చేయాలని సూచించారు. త్వరితగతిన తమ సొంత ఇంటి కలను పూర్తి చేసుకునేలా అధికారులు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీల సభ్యులు ప్రోత్సహించాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post