అకాల వర్షాలతో పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
100% ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఓపెన్ చేయాలి
రాబోయే 2 రోజులపాటు తుపాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం
పత్తి , ధాన్యం, మొక్కజోన్న వంటి పంటల కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు
హాజరైన ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్
----------------------------
రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 27:
----------------------------
తుఫాన్ కారణంగా కురిసే అకాల వర్షాలతో రైతుల పంట నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు.
పత్తి, ధాన్యం, మొక్కజోన్న వంటి పంటల కొనుగోలు పై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు, సీఎస్ రామకృష్ణారావు, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించగా, ఐడీఓసీ నుంచి ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా *రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,* రాబోయే 2 రోజుల పాటు తుపాన్ ప్రభావంతో మన రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. జిల్లాలో ఉన్న వరి, పత్తి, మొక్కజోన్న పంట కొనుగోలు కేంద్రాల వద్ద వర్షాల కారణంగా ఎటువంటి నష్టం వాటిల్లకుండా కలెక్టర్ లు జాగ్రత్తలు పాటిస్తూ చర్యలు తీసుకోవాలని సూచించారు.నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం 100% ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయాలని ఆదేశించారు.
పంట కొనుగోలు ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలు, వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు సివిల్ సప్లై కమిషనర్ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు.
అన్నారు. పంట కొనుగోలు విషయంలో చిన్న తప్పు, అక్రమాలకు కూడా ఆస్కారం లేదని, ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
*మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,* తుఫాన్ ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తూర్పు తెలంగాణ ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున పంట కోతలు వాయిదా వేయాలని మంత్రి రైతులకు విజ్ఞప్తి చేశారు. కోతలు చేసిన మొక్కజోన్న, వరి వంటి పంటలు నాణ్యతా ప్రమాణాలు ఉంటే వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని, పంట తరలింపుకు వాహనాల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మార్కెట్ కు చేరిన పంట అకాల వర్షాలకు తడవకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర టార్ఫాలిన్ కవర్లు సిద్ధం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించామని నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాలలో సోయాబీన్ ఉత్పత్తులను కొనుగోలుకు సైతం కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంబంధిత కలెక్టర్లకు మంత్రి తెలిపారు.
వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల కులాల వద్ద తేమ శాతం పరిశీలించి నాణ్యత ప్రమాణాలు ఉంటేనే కొనుగోలు కేంద్రాలకు పంట తీసుకుని వచ్చేలా చూడాలన్నారు.
12% కంటే ఎక్కువ తేమ ఉంటే సిసిఐ కేంద్రంలో పత్తి కొనుగోలు చేయాలన్నారు. మన రైతులకు నష్టం కల్గవద్దని వీలైనంతవరకు పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, బోర్డర్ జిల్లాలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పంట అమ్ముకోకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.
*సీఎస్ కె. రామ కృష్ణా రావు మాట్లాడుతూ,* ధాన్యం, పత్తి, మొక్కజోన్న పంటలను రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం మద్దతు ధర అందించి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుందన్నారు. రాబోయే 45 రోజుల నుంచి 2 నెలల కాలంలో ధాన్యం కొనుగోలు ఉదృతంగా జరుగనుందని, అధికారులు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ సజావుగా కొనుగోలు జరిగేలా చూడాలని అన్నారు.
కపాస్ కిసాన్ యాప్ ద్వారా ప్రస్తుతం పత్తి కొనుగోలు కోసం స్లాట్ బుకింగ్ జరుగుతుందని, ప్రతి గ్రామం లో వ్యవసాయ విస్తరణ అధికారుల ద్వారా రైతుల అప్ డేట్ మొబైల్ నెంబర్ వివరాలు సేకరించి షెడ్యూల్ ప్రకారం పత్తి కొనుగోలు జరిగేలా చూడాలని అన్నారు.
*రైతులకు అందుబాటులో ఉండాలి..*
*ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్*
రైతులకు ఆయా శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, పంట ఉత్పత్తులు వర్షానికి తడవకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నగేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా పౌర సరఫరాల అధికారి చంద్ర ప్రకాశ్, డీఏఓ అఫ్జల్ బేగం, డీ సీ ఓ రామకృష్ణ, మార్కెటింగ్ అధికారి ప్రకాశ్, సీసీఐ, డీసీఎంఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.