పద్మశాలి సంఘం ప్రతినిధికి ఘనంగా సన్మానం
ఇటీవల జరిగిన పద్మశాలి సంఘం ఎన్నికల్లో 23 వ వార్డు ప్రతినిధిగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుండెల్లి రమేష్ ను వార్డులోని స్థానికులు శాలువాతో సత్కరించారు. వార్డు పరిధిలో సంఘ పరంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా రమేష్ తెలిపాడు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో యువతకు మార్గం నిర్దేశం చేసే దిశగా అడుగులు వేయాలని స్థానికులు ఆకాంక్షించారు. తమ నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పద్మశాలి సంఘం భవన నిర్మాణంతో పాటు మార్కండేయ స్వామి ఆలయ నిర్మాణం కూడా చేయించే అవకాశం రావడం గొప్ప విషయంగా భావిస్తున్నానని రమేష్ అన్నారు. కార్యక్రమంలో వేముల సురేష్, నల్లగొండ సాయిచంద్, సాయి ప్రసాద్, పాముల ఆంజనేయులు, కొంపల్లి శివశంకర్, మెర్గు నాగరాజు, వేముల సాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.