సిరిసిల్ల, 09 సెప్టెంబర్ 2025: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంత్రి గడ్డం వివేక్ ను సన్మానించనున్నట్లు మాల మహానాడు జాతీయ ఉపాధ్యక్షులు రాగుల రాములు తెలిపారు. బుధవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర గనులు, కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ కు సన్మాన కార్యక్రమం ఉంటుందని, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాగుల రాములు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు సిరిగిరి రమేష్, గొట్టే లింబాద్రి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
రేపు సిరిసిల్లకు రానున్న మంత్రి గడ్డం వివేక్
byJanavisiontv
-
0