పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
సిరిసిల్ల, 09 అక్టోబర్ 2025: సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ 8వ వార్డు మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. మంగళవారం పాఠశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులకు పద్యపఠన పోటీలను నిర్వహించారు. పోటీలలో సుమారు 25 మంది విద్యార్థులు పాల్గొని పద్యాలను రాగయుక్తంగా, అక్షర దోషాలు లేకుండా, తప్పులు లేకుండా, భావ దోషం లేకుండా పాడి, భావాన్ని కూడా వినిపించారు. ఒక్కొక్క విద్యార్థి 20 కి పైగా పద్యాలు ఆలపించి ఆకట్టుుకున్నారు. విద్యార్థులు ఈ విధంగా రాగయుక్తంగా, తప్పులు లేకుండా పద్యాలు పాడడానికి ప్రోత్సహించిన ఉపాధ్యాయురాలు భాగ్యనగర్ మాధవిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందo అభినందించారు. పోటీలకు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోతిలాల్ హాజరై విద్యార్థులు ప్రతిభను మెచ్చుకున్నారు "పుట్టుక నీది.. చావు నీది.. బ్రతుకంతా దేశానిది" అన్న కాళోజీ మాటలను గుర్తు చేస్తూ, విద్యార్థులకు ఆయన గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రవర్తుల రమాదేవి, ఉపాధ్యాయ బృందo గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్, భాగ్యనగర్ మాధవి, లకావత్ ఉమ, నాగుల వీణ, నందాల శంకర్, జనగాం రాజమల్లు, ఈరబోయిన రవికుమార్, గడ్డి మహేష్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.