మాల మహానాడు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

మాల మహానాడు జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నికరాజన్నసిరిసిల్ల 16 సెప్టెంబర్ 2025: మాల మహానాడు రాజన్నసిరిసిల్ల జిల్ల విస్తృతస్థాయి సమావేశం పెద్దూర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ హాజరై మాట్లాడారు. ఏబిసిడి వర్గీకరణ ద్వారా మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో మారు పునరాలోచించి వర్గీకరణ చట్టాన్ని సవరించాలని సూచించారు. లేనిపక్షంలో న్యాయ పోరాటాలకు సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నీరటి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంగ కిరణ్, ఉపాధ్యక్షుడిగా మూలె కిషోర్, వంకాయల మహేష్, ప్రధాన కార్యదర్శిగా గూడ బాబు, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జిగా ఎడ్ల రాజకుమార్, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ గా బత్తుల కమలాకర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రోడ్డ రామచంద్రం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాలుక సత్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య, రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శి ఎలుక దేవయ్య, జిల్లా మాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు తుంగ శివరాజ్, కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రవెల్లి నాగరాజు, 12 మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రతినిధులు హాజరయ్యారు.

Post a Comment

Previous Post Next Post