రాజన్న సిరిసిల్ల జిల్లా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం హరిత

బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ ఎం హరిత
శుభాకాంక్షలు తెలిపిన అదనపు కలెక్టర్, జిల్లా అధికారులు


రాజన్న సిరిసిల్ల, 29 సెప్టెంబర్ 2025:


జిల్లా కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సమీకృత కార్యాలయానికి రాగా, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్ లో కలెక్టర్ ఎం హరిత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. 

అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు, అధికారులు, సిబ్బంది కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

కార్యక్రమంలో ఏఓ రాంరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post