కొనరావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ

కొనరావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ
కొనరావుపేట మండల బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ, PACS చైర్మన్ బండ నర్సయ్య బిఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ నర్సయ్య

కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బండ నర్సయ్య, వట్టిమల్ల మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ దర్శనాల శంకరయ్య తదితరులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

కొనరావుపేట ప్రాథమిక వ్యవసాయం సహకార సంఘం చైర్మన్ బండ నర్సయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ బిడ్డ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అనునిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వేములవాడ నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నాడని ఆయన నాయకత్వంలో పని చేస్తూ ముందుకు పోతామన్నారు.

Post a Comment

Previous Post Next Post