రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి పూలె విగ్రహావిష్కరణ

రాజన్నసిరిసిల్ల, 26 ఆగస్టు 2025: 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రి పూలె విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కేట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి, జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చొక్కాల రాము తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహత్మా జ్యోతి బాపులె, సావిత్రి బాపులే ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. మహనీయుల ఆశయాలను ముందు తరాలకు తెలిసేలా చూడాలని సూచించారు. వివక్ష, వెట్టిచాకిరి నిర్మూలించాలంటూ, సమాజంలోని పేద బిడ్డలు విద్యారంగంలో ముందుకు పోవాలని అన్ని అసమానతలు పోవాలని పోరాటం చేశారని గుర్తు చేశారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన రూపుమాపి ఆడ పిల్లలకు చదువే ఆయుధం అని అనేక పాఠశాలలు నెలకొల్పి విద్యను అందించిన మహనీయులు మహత్మా జ్యోతి బాపులె, సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రంథాలయం ఎదుట ఎర్పాటు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. మొన్నటి రోజున హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలసి మహత్మా జ్యోతి బాపులె జీవిత కథ ఆధారంగా నిర్మించిన సినిమాను చూడటం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన మూడు గంటల్లోనే ఆనాటి ప్రగతి భవన్ కు మహత్మా జ్యోతి బాపులె పెరు పెట్టడం జరిగిందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో అన్నీ వర్గాలకు ప్రజా ప్రభుత్వంలో సమన్యాయం జరుగుతుందని తెలిపారు. వారి స్పూర్తితో రాహుల్ గాంధీ 42 శాతం బీసీ బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. మహనీయుల చరిత్రను అందరూ తెలుసుకోవాలని చెప్పారు. వారి అడుగు జడల్లో ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.

Post a Comment

Previous Post Next Post