ఆగమ శాస్త్రము ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఆగమ శాస్త్రము ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
 
మహా మండపం పరిధిలోని ప్రధాన ఆలయ అభివృద్ధి పనులు ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం

ఆలయ పునర్నిర్మాణ సమయంలో నిరంతరాయంగా స్వామి వారికి కొనసాగనున్న కైంకర్య సేవలు

రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ ను వివరిస్తూ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్


ఆగమ శాస్త్ర ఆధారంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ ప్రాంగణం ఓపెన్ స్లాబ్ హల్ నందు రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ ను వివరిస్తూ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పాల్గొన్నారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్య నారాయణ మూర్తి వివరించారు.

Post a Comment

Previous Post Next Post