గణేష్ మండపాల నిర్వాహకులకు పోలీసు శాఖ సూచనలు


గణేష్ నవరాత్రుల సందర్భంగా మండపాల నిర్వాహకులు పోలీస్ వారు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీజే పర్మిషన్ లేదని తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా policeportal.tspolice.gov.in/index.htm లో పర్మిషన్‌ కోసం అప్లై చేసుకుని, అనుమతి తీసుకోవాలని సూచించారు.

వినాయకుడి మండపాలు ఎర్పాటు చేసేవారికి రాజన్న సిరిసిల్లా జిల్లా పోలీసు వారి విజ్ఞప్తి

1. గణేష్ మండపాలను ప్రజారవాణ, ఎమర్జెన్సీ వాహనలు ఇబ్బంది లేకుండా ఎర్పాటు చేసుకోవాలి.
2. మండపాలు ఏర్పాటు చేసేవారు సంబంధిత శాఖల అనుమతి, విద్యుత్ శాఖ వారి అనుమతి తీసుకోవాలి.
3. మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులదే, ప్రతి మండపాల వద్ద తప్పని సారిగా సిసి కెమరాలు ఎర్పాటు చేయాలి.
4. గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమీటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్లను మండపంలో ఏర్పాటు చేయాలి.
5. గణేష్ ప్రతిమలు కుర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణం మంచి నాణ్యతతో ఏర్పాటు, షాట్ సర్క్యూట్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
6. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకొవాలి.
7. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శన దృష్టిలో వుంచుకొని భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
9. వృద్ధులు, చదువుకునే విద్యార్థులు, చిన్నపిల్లలకు ఎలాంటి ఇబ్బందుల కలగకుండా ఉండే చిన్న స్పీకర్లను పోలీస్ శాఖ వారి అనుమతితో ఏర్పాటు చేసుకోవాలి.
10. సుప్రింకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.
11. మండపాల్లో మరియు శోభయాత్రలో ఎట్టి పరిస్థితులో డిజేను ఏర్పాటు చేయరాదు.
12. గణేష్ మండపాల (మధ్యం సేవించడం, జాదం ఆడటం, అసభ్యకరమైన నృత్యాల ఎర్పాటు, ఇతరులను కించపరిచే విదంగా ప్రసంగాలు, పాటులు ఎర్పాటు చేయడం పూర్తిగా నిషేదం.
13. మండపాల్లో ఏదైగా అనుమానాప్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తుల కనిపించినట్లయితే తక్షణమే (డయల్ 100) గానీ లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
14. మండపాల వద్ద అగ్నీప్రమదాలు సంభవించే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తతో డ్రంబులలో నీరు, ఇసుక ఏర్పాటు చేయాలి.
15. సామాజిక మాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకుడదు ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికీ లేదా (డయల్ 100) కి సమాచారం అందించాలి.
16. మధ్యాహ్నం నుండి గణేష్ నిమార్జన శోభయాత్ర ప్రారంభించి నిర్దేశించిన సమయానికి నిమార్జనం పూర్తిచేయాలి.
17. మహిళ రక్షణకు మొదటి ప్రాదాన్యత ఇస్తున్నామని, గణేష్ మండపాలవద్ద మహిళలకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పోలీస్ వారి సలహలు, సూచనలు పాటిస్తు శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరారు.

Post a Comment

Previous Post Next Post