వినాయక చతుర్థి పోలీస్ పోర్టల్ ద్వార ఆన్లైన్ అప్లికేషన్
రాబోయే గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా విగ్రహ స్థాపన, శోభాయాత్రలు నిర్వహించుకోవడానికి అనుమతుల కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా పోలీస్ పోర్టల్ (https://policeportal.tspolice.gov.in/) ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు ఎవరైనా ఈ లింక్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని అనుమతులను పొందవచ్చని పోలీసులు తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సులభతరంగా అనుమతులు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.