బివైనగర్ డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడి ఆగమన్ కార్యక్రమం
సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించనున్న గణనాథుడిని సిరిసిల్ల ప్రధాన రహదారుల గుండా భక్తి పారవశ్యంతో ఊరేగింపుగా తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో గణనాథుడిని ప్రత్యేకంగా ముస్తాబు చేయించి నిర్వాహకులు సిరిసిల్లకు తీసుకువచ్చారు.
శనివారం డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో ట్రాక్టర్ పై వినాయకుడిని ఊరేగింపుగా కొత్తచెరువు నుంచి నేతన్న చౌరస్తా, అంబేద్కర్ చౌక్, గోపాల్ నగర్ చౌరస్తా మీదుగా బివైనగర్ లోని ప్రతిష్టాపన మండపానికి తరలించారు. వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో, పూజలు చేసి వేడుక జరుపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగమన్ కార్యక్రమంలో యూత్ సభ్యులు జి.బౌధిష్, ఎన్ శ్రీకాంత్, జి సాయి కుమార్, వై అజయ్, వి కళ్యాణ్, తదితరులు డైనమిక్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.