రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు
సిరిసిల్ల 14 జులై 2025: సిరిసిల్ల అర్బన్ పరిది పెద్దూర్ పరిసర ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి. వాహనదారులు మితిమీరిన వేగంతో వెలుతు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించగా పలు సంఘటనల్లో చాలామంది గాయాలపాలయ్యారు. ఈ అంశంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెనమనేని కమలాకర్ రావు రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయించారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయించాలంటూ కమలాకర్ రావు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించగా స్పందించిన అధికార యంత్రాంగం నేడు పెద్దూరులోని పలు ప్రాంతాల్లో రోడ్లపై స్పీడ్ బ్రేకర్లను వేయించారు. పెద్దూరు బస్టాండ్ వద్ద, సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద, కల్లు మండువ వద్ద జనసంచారం ఉంటుండడంతో ఆయా ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లను వేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కమలాకర్ రావుతో పాటు మాజీ సర్పంచ్ రాకం రమేష్, కాంగ్రెస్ నాయకులు గుగ్గిళ్ళ తిరుపతి, సల్లూరి మురళి, అధికారులు ఉన్నారు.