నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోంది: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోంది: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

నూతన రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది

రేషన్ కార్డుతో పేద కుటుంబాలకు 10 లక్షల కవరేజి తో ఆరోగ్యశ్రీ లబ్ది

పేదలకు సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం

బోయిన్ పల్లి మండల కేంద్రంలో రైతు వేదిక లో నూతన రేషన్ కార్డులనుచోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

బోయిన్ పల్లి, 29 జూలై 2025:


నిరంతర ప్రక్రియగా నూతన రేషన్ కార్డుల జారీ కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి బోయిన్ పల్లి మండల కేంద్రంలో రైతు వేదిక లో లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు మరియు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ,* నేడు బోయిన్ పల్లి మండలంలో 1070 పేద కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని, అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 1971 రేషన్ కార్డు లలో కొత్త సభ్యులను జమ చేస్తున్నామని నూతనంగా దాదాపు 6,000 మంది ప్రజలకు రేషన్ అందనున్నందని కలెక్టర్ తెలిపారు.

ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా కీలకమైన డాక్యుమెంట్ మని కరెంట్ కనెక్షన్ , ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగ పడుతుందని కలెక్టర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, ఎవరైనా అర్హులు దరఖాస్తు చేసుకుంటే వెంటనే పరిశీలించి రేషన్ కార్డు మంజూరు చేస్తామని అన్నారు 

*చోప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,* రేషన్ కార్డు పేద ప్రజల జీవితంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. గత పది సంవత్సరాలుగా ఒక పేద కుటుంబానికి రేషన్ కార్డు, ఇండ్లు ఇవ్వలేదని అన్నారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్నామని అన్నారు.

నూతన రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో బోయిన్ పల్లి మండలంలో అత్యధికంగా ఇండ్లు మంజూరు చేసామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రేషన్ కార్డుతో 9 రకాల వస్తువులు ఇచ్చామని, గత పాలకుల హయాంలో ఆ సామాగ్రిని రద్దు చేశారని అన్నారు.

మన ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్ ఎటువంటి బియ్యం తింటారు పేద ప్రజలకు కూడా అటువంటి సన్న బియ్యం రేషన్ కార్డు ద్వారా సరఫరా చేయడం ఉగాది నుంచి ప్రారంభించామని, దీనితో రేషన్ కార్డ్ ప్రాముఖ్యత గణనీయంగా పెరిగిందని అన్నారు.  

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టిసి బస్సులో ఉచిత బస్సు ప్రయాణం పథకాలను ప్రారంభించామని అన్నారు . పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని అన్నారు.  

 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నామని, 25 లక్షల రైతులకు 2 లక్షల వరకు పంట రుణ మాఫీ, సన్న వడ్లకు క్వింటాళ్ల 500 బోనస్, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రెసిడెన్షియల్ పాఠశాలలో 40% డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీల పెంపు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల చేపట్టామని అన్నారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రజిత, బోయిన్ పల్లి తహసిల్దార్ నారాయణ రెడ్డి, ఎం. పి. డి. ఓ జయశిలా, సెస్ డైరెక్టర్ సుధాకర్, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post