గంభీరావుపేట సామాజిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..

గంభీరావుపేట సామాజిక ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ..



సిరిసిల్ల జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా. పెంచలయ్య ఈ రోజు గంభీరావుపేట సామాజిక ఆసుపత్రి ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. డెంగ్యూ జ్వరం తో చేరి వైద్యం పొందుతున్న సింగారం గ్రామానికి చెందిన యువకున్ని పరామర్శించి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఓ పి సేవలు,ల్యాబ్ సేవలు,ఫార్మసీ మరియు అత్యవసర విభాగాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆసుపత్రి కి వచ్చే రోగులకు అన్ని వేళలా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీరి వెంట డా.సింధు, డా.సుష్మ, నాగరాజు, రంజిత్, ఇతర వైద్య సిబ్బంది ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post