సినీ నిర్మాత ఫిర్యాదుతో ఓ యూట్యూబర్‌పై కేసు నమోదు

ఫిల్మ్‌నగర్‌: సినీ నిర్మాత ఫిర్యాదుతో ఫిల్మ్‌నగర్‌ పోలీసులు ఓ యూట్యూబర్‌పై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు చెందిన నవీన్‌ సినిమా రివ్యూలు ఇస్తుంటాడు. ‘వర్జిన్‌ బాయ్స్‌’ చిత్ర ప్రమోషన్‌ కోసం అతడికి చిత్ర యాజమాన్యంతో ముందస్తుగా ఒప్పందం కుదిరింది. ఆ చిత్రం ప్రమోషన్‌కు సంబంధించి నవీన్‌ తొలుత మంచిగా రివ్యూలు ఇచ్చాడు. ఒప్పందం ప్రకారం చిత్ర బృందం నవీన్‌కు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇచ్చింది. అనంతరం ఆ చిత్రానికి సంబంధించి రకరకాల రివ్యూలు ఇస్తుండడంతో చిత్రబృందం అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమాకు నష్టం వాటిల్లేలా అతడు రివ్యూలు ఇచ్చాడని చిత్ర నిర్మాత రాజా దరపునేని ఫిల్మ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఇన్స్‌పెక్టర్‌ తెలిపారు. మిత్రా శర్మ, గీతానంద్‌, శ్రీహాన్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో దయానంద్‌ తెరకెక్కించిన ‘వర్జిన్‌ బాయ్స్‌’ చిత్రం ఈ నెల 11న విడుదలైంది. 

Post a Comment

Previous Post Next Post