ప్రముఖ రెజ్లింగ్ స్టార్ కన్నుమూత
దిగ్గజ రెజ్లర్ హల్క్ హోగన్ (71) కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టుతో అమెరికా ఫ్లోరిడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1953లో జన్మించిన ఈయన 1980ల్లో గ్రేటెస్ట్ ప్రొఫెషనల్ రెజ్లర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. 6 సార్లు WWF ఛాంపియన్గా నిలిచారు. గత ఎన్నికల్లో ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హోగన్కు తన మీసాలు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.