రాజన్నసిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న జలాశయాల ప్రస్తుత పరిస్థితి
సిరిసిల్ల 13 జూలై 2025: మాధ్యమానేరు జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 27.55 టిఎంసిలకు గాను 6.8 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. మానేరు నుంచి కానీ మూల వాగు నుంచి కానీ ఏ విధమైన వరద ప్రవాహం రావటం లేదు. అన్నపూర్ణ రిజర్వాయర్ ప్రస్తుత నీటిమట్టం 3.5 టీఎంసీలకు గాను 1.22 టీఎంసీల నీరు నిలువ ఉంది. వరద ప్రవాహం ఏమీ రావడం లేదు. ఎగువ మానేరు జలాశయం నీటి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.63 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నది. ఏ విధమైన వరద ప్రవాహం ఎగువ మానేరులోకి ప్రస్తుతం రావటం లేదు.