ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక..

ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక..
తెలంగాణలో రానున్న ఐదు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి ఆవరణలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

దోమల వ్యాప్తి నివారణకు ఇంట్లోని తలుపులు, కిటికీలను దోమ తెరలతో కప్పి వేయాలని సూచించింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆహారం, నీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. దోమల వ్యాప్తి నివారణకు ఇంట్లోని తలుపులు, కిటికీలను దోమ తెరలతో కప్పి వేయాలని సూచించింది. దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆహారం, నీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య శాఖ పేర్కొంది. కాచి చల్లార్చిన నీటినే తాగాలని పేర్కొంది.

పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలని సూచించింది. జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ఆరోగ్యశాఖ సూచించింది. ముఖ్యంగా దోమల వ్యాప్తి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. దోమల కారణంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సంక్రమిస్తాయని వైద్య శాఖ పేర్కొంది. ఇంటి పరిసరాల్లోని సెప్టిక్ ట్యాంకులు, ఇతర నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు సంతానోత్పత్తి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించింది.

వర్షాకాలంలో సాధారణంగా ప్రజలు జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఇబ్బందులు పడుతుంటారని.. ఒక్కోసారి ఇవి తీవ్రమైన అంటువ్యాధుల లక్షణాలు కూడా మారొచ్చని అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. అలాగే వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. బయటి వ్యక్తులతో కరచాలనం (హ్యాండ్‌ షేక్) వీలైనంతగా తగ్గించాలని, సానిటైజర్‌ తో చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యారోగ్య శాఖ సూచనలు చేసింది

Post a Comment

Previous Post Next Post