ఐ.టి.ఐ. లో మొదటి విడత అడ్మిషన్ (2025-26/27) గడువు. 2025-26/27 విద్యా సంవత్సరానికి ఐ.టి.ఐ లలో అడ్మిషన్ కొరకు గడువు ఈ నెల 02 వ తేదీ నుండి జూన్ 21 తేదీ వరకు సిరిసిల్ల ప్రభుత్వ ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ శ్రీమతి.యస్.కవిత ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ.టి.ఐ. లలో (ఒకటి మరియు రెండు సంవత్సరాల కోర్సులకు) ఈ సంవత్సరం 2025-26/27 అడ్మిషన్ల కొరకు మొదటి విడత దరఖాస్తుల స్వీకరణ (ఆన్లైన్ లో) జూన్ 02 వ తేదీ నుండి ప్రారంభం అయ్యి జూన్ 21 వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రిన్సిపల్ గారు తెలియజేసారు. అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికేట్ లను {యస్.యస్.సి, కుల దృవీకరణ(కొత్తది), స్థానిక (లోకల్) స్టడీ (కనీసం 6 తరగతులు తెలంగాణలో చదివి ఉంటే వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణిస్తారు) మరియు బదిలీ (టి. సి) లను ఆన్లైన్లో మీ పాసుపోర్ట్ సైజ్ ఫోటోతో సహా స్కాన్ చేసి అప్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇందుకు గాను http://iti.telangana.gov.in అనే వెబ్ సైట్ నందు , మీ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలని ( మీ స్వంత మరియు పర్మనెంట్ ఫోన్ నెంబర్ వాడుట మంచిది. ఎందుకంటే ఆ తరువాత మీ ఆడ్మిషన్ కు సంబంధించిన ప్రతీ ఉత్తర ప్రతుత్తరాలు చిన్న సమాచారాల ద్వార (SMS) మీకు తెలియపరుస్తారు) తెలంగాణ లోని ఏ గవర్నమెంట్ లేదా ప్రైవేటు ఐ.టి.ఐ. లలో గాని ఒక్క రిజిస్ట్రేషన్ తో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందని అలాగే మీకు నచ్చిన ట్రేడ్ కూడా ప్రాధాన్యత ఆధారంగా ఎంచుకోవొచ్చు అని తెలియజేశారు.
ప్రభుత్వ ఐ.టి.ఐ. సిరిసిల్ల నందు "1. ELECTRICIAN, 2. FITTER, 3. MOTER MECHANIC VEHICLE, 4. WELDER 5.DM CIVIL మరియు 6. MECHANIC DIESEL 7. COMPUTER OPARATING PROGRAMING ASSISTANT, 8. FASHION DESIGHN AND TECHNOLOGY.ట్ట్రేడ్ లలో అవకాశం కలదు కావున అర్హత గల విద్యార్థినీ, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపల్ యస్.కవిత తెలియజేశారు.
వివరాలు
1-8-2025 నాటికి అభ్యర్థికి కనీసం 14 సంవత్సరాలు నిండి ఉండాలి. అభ్యర్థుల మార్కులు, రిజర్వేషన్, స్థానికత మరియు మీ ఆప్షన్ ల ఆధారంగా మీకు సీట్ (అడ్మిషన్) కేటాయించబడును.
ఏ ఐ.టి.ఐ. లో కూడా అప్లికేషన్ స్వీకరించబడవు
ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి.
విద్య అర్హత మరియు కోర్స్, సిలబస్ వివరాలు వెబ్ సైట్ నందు పొందుపరచబడ్డాయి.
ఇతర వివరాలకు మీ దగ్గరలోని గవర్నమెంట్/ ప్రైవేటు ఐ.టి.ఐ. ని సంప్రదించండి.