రాజన్న సిరిసిల్ల: నీలి విప్లవం 2018-19 పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో “ఇందిరా మహిళా శక్తి” పథకం క్రింద 2 స్వయం సహాయక గ్రూపులకు (మహిళకు) మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు (mobile fish retail outlets) 60% సబ్సిడీ పై మంజూరు కాబడినవి. ఇట్టి విషయములో, లబ్దిదారుని ఎంపిక చేయుటకు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తేది : 02.05.2025 నుండి 09.05.2025 వరకు జిల్లా మత్స్య శాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయము నందు, 40% లబ్దిదారుని వాటా చెల్లించగల ఔత్సాహిక స్వయం సహాయక గ్రూపుల (మహిళలు) నుండి తమ దరఖాస్తును, జిల్లా మత్స్య శాఖ అధికారి, రాజన్న సిరిసిల్ల కార్యాలయంనందు సమర్పించవలసినదిగా కోరుతున్నారు. కావున, ఆసక్తి కలిగి, 40% లబ్దిదారుని వాటా చెల్లించగల ఔత్సాహిక స్వయం సహాయక గ్రూపుల వారు (మహిళలు) జిల్లా మత్స్యశాఖ అధికారి కార్యాలయం నందు నేరుగా గాని పోస్టు ద్వారా గాని సమర్పించవలసినదిగా తెలిపారు.
కార్యాలయ చిరునామా:
జిల్లా మత్స్య శాఖ అధికారి,
రాజన్న సిరిసిల్ల,
F8, మొదటి అంతస్తు,
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం,
రాజన్న సిరిసిల్ల, సిరిసిల్ల - 503 001.
(మరిన్ని వివరాలకు ఫోన్ నెంబర్: 9491651263 సంప్రదించగలరు)
సౌజన్య
జిల్లా మత్స్యశాఖ అధికారి,
రాజన్న సిరిసిల్ల.