దేశవ్యాప్త కుల గణన ప్రకటన కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితమే
టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్
దేశవ్యాప్తంగా కుల గణన చేపడుతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ ఘనతేనని అన్నారు టిపిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సంగీతం శ్రీనివాస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలు, వివిధ భాషలు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలను పలకరిస్తూ వారి ఆకాంక్షలను తెలుసుకుంటూ దేశ అభివృద్ధి కోసం ఆలోచించి జన గణన జరగాలి ఎవరు లెక్క ఎంతో తేలాలి అని నినదించాడని తెలిపారు.
కుల గణన జరిగితేనే ఎవరి జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆ ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు దేశ ప్రజలకు సమాన వాటాలో అందించవచ్చు అని చెప్పిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు.
జన గణనలో భాగంగా కుల గణన చేపట్టడం ద్వారా రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో వారి వారి వాటా ప్రకారం సమన్యాయం చేసేందుకు మార్గము సుగుమమవుతుంది అని అన్నారు.
రాహుల్ గాంధీ అభిప్రాయంతో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో కుల గణన జరిపి దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శమైందని అన్నారు. ఏ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికే ఆచరణాత్మకంగా నిలిచారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది పైచిలుకు ఎన్యుమరేటర్ల తో కుల గణన జరిపి అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్ర గవర్నర్ ద్వారా ఆమోదింప చేసుకున్న ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు అసెంబ్లీలో కుల గణన తీర్మానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం రావడం, వేములవాడ ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ కు ఈ అంశాన్ని బలపరిచే అవకాశం రావడం గర్వకారణమని అన్నారు.
దేశంలోని కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలలో కులగనన చేపట్టి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టే విధంగా మార్గదర్శకంగా నిలిచారన్నారు.
అంతటితో ఆగకుండా రాష్ట్రంలోని బీసీ సంఘాలను కూడగట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ కుల గణన జరిపించాలంటూ ఆందోళన కార్యక్రమం నిర్వహించి, దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టి షెడ్యూల్ 9 లో చేర్చాలని డిమాండ్ చేయడం జరిగిందన్నారు.
ఈ పరిణామాలను గ్రహించిన కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని కుల గణన చేపడతామని ప్రకటించడానికి స్వాగతిస్తున్నామన్నారు.
దేశ ప్రజల సంక్షేమం కోరుతూ, సమాన హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే ఈ ఘనత దక్కుతుందని చెప్పారు.
ఈ అంశంలో సహకరించిన బీసీ సంఘాలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.