సన్న వడ్ల సేకరణకు రైస్ మిల్లులు సిద్ధం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సన్న వడ్ల సేకరణకు రైస్ మిల్లులు సిద్ధం: కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 2025: జిల్లాలో సన్న వడ్లు పండించిన రైతుల ధాన్యం సేకరించేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సన్న వడ్లు పండించిన రైతులు తమ గ్రామంలోని కొనుగోలు కేంద్రాల్లో సరైన తేమశాతం తో విక్రయించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని 18 రైస్ మిల్లులు సన్న వడ్లు సేకరించేందుకు సిద్ధంగా ఉన్నారని కలెక్టర్ వెల్లడించారు. సరైన ప్రమాణాలతో సన్నవడ్లు విక్రయించి రైతులు ప్రభుత్వమిచ్చే బోనస్ పొందాలని సూచించారు.

Post a Comment

Previous Post Next Post