సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి టియుడబ్ల్యూజే ఐజేయు సన్మానం
సిరిసిల్ల, 07 ఏప్రిల్2025: సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్షులు ఆకుల జయంత్, ప్రధాన కార్యదర్శి మహేందర్ లతో పాటు ఉపాధ్యక్షులు పరశురాములు, కోశాధికారి వంకాయల శ్రీకాంత్, సహాయ కార్యదర్శి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ప్రయాకర్ రావు వేణు, జంగిలి రాజు, ముండ్రాయి శ్రీనివాస్, చౌటపల్లి వెంకటేష్, దుమాల రాములను సోమవారం సిరిసిల్ల జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి కాంబోజ ముత్యం, స్టేట్ కౌన్సిల్ మెంబర్ దాసరి దేవేందర్, రాష్ట్ర గ్రామీణ ప్రాంత విలేకరుల సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించి, రాజన్న ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టులంతా ఐక్యంగా ఉంటే, సమస్యలను పరిష్కరించుకోవడం పెద్ద సమస్యేమీ కాదన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ నాయకత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. వృత్తిపరమైన సవాళ్ళనూ, ఇబ్బందులనూ ధీటుగా ఎదుర్కోడానికి యూనియన్ జర్నలిస్టులకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు టీవీ నారాయణ, కాశీ, పాలమాకుల శేఖర్, జాన దయానంద్, బాబు, కృష్ణ, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.