ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి TUWJ (IJU) అభినందనలు

ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఆకుల జయంత్
కొత్త కార్యవర్గానికి TUWJ (IJU) అభినందనలు

ఆదివారం జరిగిన సిరిసిల్ల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఆకుల జయంత్ కుమార్ తన సమీప అభ్యర్థి చింతకింది శ్యాం పై 12 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గా బొడ్డు పర్శరాములు,
ప్రధాన కార్యదర్శిగా ఆడెపు మహెందర్,
సహాయ కార్యదర్శిగా 
కంకణాల శ్రీనివాస్,
కోశాధికారిగా 
వంకాయల శ్రీకాంత్ లు ఎన్నికయ్యారు.
సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సిరిసిల్ల జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్‌ యూనియన్ అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి కాంబోజ ముత్యంలు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దాసరి దేవేందర్, రాష్ట్ర గ్రామీణ ప్రాంత విలేకరుల సంక్షేమ సంఘం సభ్యులు టీవీ నారాయణ, రాష్ట్ర లీగల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు రేగుల దేవేందర్ లు అభినందించారు.

నూతన కార్యవర్గం క్లబ్ బలోపేతానికీ,జర్నలిస్టుల ఐక్యతకు కృషి చేయాలని ఆయన సూచించారు.

Post a Comment

Previous Post Next Post