వేములవాడ రాజన్న సేవలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ కార్యవర్గం

వేములవాడ రాజన్న సేవలో సిరిసిల్ల ప్రెస్ క్లబ్ కార్యవర్గం 
సిరిసిల్ల, 9 ఏప్రిల్ 2025: వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం మహదానంగా ఉందని అన్నారు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్. ఆదివారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ కు జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో గెలుపొందిన పాలకవర్గ సభ్యులు వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని అర్చక స్వాములు అధ్యక్షుడు తో పాటు కార్యవర్గ సభ్యులను కండువా కప్పి ఆశీర్వదించి, లడ్డు ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా సహకరించిన టియూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ కు పాలకవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్వామివారి దర్శనంలో అధ్యక్షుడు ఆకుల జయంత్ తో పాటు, ప్రధాన కార్యదర్శి ఆడెపు మహేందర్, ఉపాధ్యక్షుడు పరుశురాములు, కోశాధికారి శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు వెంకటేశం, రాము, రాజు, వేణు కుమార్, రామనాథం తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post