ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 199వ జయంతి


సిరిసిల్ల 11 ఏప్రిల్ 2025: సంఘసంస్కర్త, బహుజనోద్దారకుడు మహాత్మ జ్యోతిబాపూలే జయంతి కార్యక్రమం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు చొక్కాల రాము ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతి బా పూలే 199వ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం జంక్షన్ వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి, నాయకులు గడ్డం నర్సయ్య, బొప్ప దేవయ్య, ఆకునూరి బాలరాజు, బొజ్జ కనకయ్య, కీసర శ్రీనివాస్, జిల్లా ఫిషరీ చైర్మన్ చొప్పరి రామచంద్రం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, జిల్లా నాయకులు బోయిన దేవరాజ్, స్వామి, జంగపల్లి శేఖర్, కరుణాల అనిల్, చొక్కాల ప్రశాంత్, శ్రీనివాస్, కూనవేని పరుశురాములు, బొజ్జ కనకయ్య, కరుణాల భద్రాచలం, వంకాయల కార్తీక్, అధిక సంఖ్యలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post