స్కామర్‌నే స్కాం చేసిన యువకుడు
ఉత్తరప్రదేశ్- కాన్పుర్‌లో భూపేంద్ర సింగ్ అనే యువకుడికి తాను సీబీఐ అధికారిని అంటూ, నీ అభ్యంతరకర వీడియోలు ఉన్నాయి కేసు మూసివేయాలంటే రూ.16వేలు ఇవ్వాలంటూ ఓ స్కామర్ కాల్ చేశాడు.
స్కామర్ కాల్ అని గమనించిన యువకుడు ఒక ఆట ఆడుకోవాలని డిసైడ్ అయి, ప్లీజ్ ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పొద్దు. మీరు చెప్తే నేను పెద్ద సమస్యలో పడిపోతానంటూ భయపడినట్లు నటించాడు.
చెప్పను కానీ డబ్బులు ఇవ్వు అని స్కామర్ అడగగా, భూపేంద్ర సింగ్ తాను ఒక బంగారం గొలుసు తాకట్టు పెట్టానని దాన్ని విడిపించడానికి రూ. 3వేలు కావాలని, ఆ గొలుసును విడిపించి తనకు డబ్బులిస్తానని నమ్మించాడు.
యువకుడి మాటలు నమ్మిన సైబర్ నేరగాడు తొలుత రూ.3వేలు ఇవ్వగా, తర్వాత తాను మైనర్ కావడంతో నగల వ్యాపారి ఆ గొలుసు ఇవ్వడం లేదని మీరు నా తండ్రిలా నగల వ్యాపారితో మాట్లాడాలని చెప్పాడు.. దానికి ఆ స్కామర్ ఒప్పుకున్నాడు. యువకుడు నగల వ్యాపారిగా తన స్నేహితుడిని నటించమని చెప్పాడు.
తర్వాత ఫోన్ మాట్లాడిన స్కామర్‌ను మరో రూ.4,480 కడితే లోన్ క్లియర్ అవుద్దని, తర్వాత ఆ గొలుసుపై రూ.1.10 లక్షల రుణం ఇస్తానని దానికి రూ.3 వేలు ప్రాసెస్ ఫీజు అవుద్దని ఇలా మొత్తం రూ.10వేలు తీసుకున్నారు.
చివరికి మోసపోయానని గ్రహించిన స్కామర్ తన డబ్బులు ఇవ్వాలని బ్రతిమాలగా, భూపేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ రూ.10 వేలను విరాళంగా ఇస్తానని చెప్పాడు.
Tags
scammers