రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనాలు

అసెంబ్లీ స్పీకర్ పట్ల మాజీ మంత్రి తీరును ఖండించిన కాంగ్రెస్ శ్రేణులు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దిష్టిబొమ్మ దహనాలు
రాజన్న సిరిసిల్ల, 16 మార్చ్: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జి జగదీష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మతో పాటు మాజీ సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా టిపిసిసి కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మాట్లాడుతూ.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల అనుచితంగా వ్యవహరించిన సూర్యాపేట శాసనసభ్యుడు జగదీష్ రెడ్డి వైఖరిని తప్పుపట్టారు. సభ మర్యాదలను తుంగలో తొక్కి ఎస్సి సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ పై దురుసుగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమేనని అన్నారు. శాసనసభ నియమాలను ఉల్లంగించడంతోనే సభ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. ప్రతిపక్ష నాయకులు అహంకార పూరిత ధోరణి మాని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమంలో సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూప, సీనియర్ నాయకులు ఆకునూరి బాలరాజు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు సుర దేవరాజు, మాజీ కౌన్సిలర్లు రాగుల జగన్, భూక్య రెడ్డినాయక్, గడ్డం నర్సయ్య, కణమేని చక్రధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post