ఉపాధి కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఉపాధి కోసం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల, 18 మార్చ్: ఉపాధి కోసం సిరిసిల్ల కార్మిక క్షేత్రంలోని కార్మికులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్. మంగళవారం ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆద్వర్యంలో మనోవికాస నిపుణులు కె. పున్నంచందర్ సిరిసిల్ల పట్టణంలోని కార్మిక క్షేత్రంలో పవర్ లూం కార్మికులకు అవగహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ.. కార్మికులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని అన్నారు. ప్రభుత్వం పవర్ లూమ్ కార్మికులకు నిరంతరం ఉపాది కల్పించడం కోసం మహిళా శక్తి, చీరల తయారీ కోసం ప్రత్యేక పథకం అమలు చేస్తున్నదని తెలిపారు. వస్త్ర పరిశ్రమలోని ఆసాములు, యాజమానుల కోసం యార్న్ డిపోను ఏర్పాటు చేసి సబ్సిడీపై నూలు ను అందించి సహకారం అందిస్తున్నదని తెలిపారు. కార్మికులు మానసిక, శారీరక ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అనేక రకాల మానసిక రుగ్మతలకు తంభాకు, మద్యపాన సేవనం కారణమౌతుందని అన్నారు. దురలవాట్లను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని కార్మికులకు సూచించినారు. కార్మికుల మానసిక సమస్యల పరిష్కారం కోసం మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ను జిల్ల ఆసుపత్రిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. అవసరమైన కార్మికులు నేరుగా సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో మరమగ్గాల పారిశ్రామికులు దుస ప్రసాద్, మైండ్ కేర్ సిబ్బంది వేముల అన్నపూర్ణ, రాపెళ్లి లత, కొండ ఉమ, బూర శ్రీమతి లు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post