ఉగాది సందర్భంగా పెద్దూర్ లో చీరల పంపిణీ

సిరిసిల్ల, 30 మార్చ్: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన ఎనిమిదో వార్డులో మహిళలకు చీరల పంపిణీతో వేడుకలు నిర్వహించారు. ఆదివారం సిరిసిల్ల పట్టణ పరిధిలోని 8వ వార్డు పెద్దూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో మాజీ వార్డ్ కౌన్సిలర్ చెన్నమనేని కీర్తి కమలాకర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి చిట్నేని ఆగమ్మ - నర్సింగరావుల జ్ఞాపకార్థం ఉగాది పండుగ సందర్భంగా చీరల పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెల్ముల స్వరూప, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తిరుపతి రెడ్డి హాజరై చీరల పంపిణీ చేశారు. సుమారు 300 మంది మహిళలు కార్యక్రమానికి హాజరై చీరలను అందుకున్నారు. 
అనంతరం చెన్నమనేని కీర్తి కమలాకర్ రావు దంపతులు వెల్ముల స్వరూప తిరుపతిరెడ్డి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో పెద్దూర్ మాజీ సర్పంచ్ రాకం రమేష్, ఉలిశె నారాయణ, తిప్పవరం నర్సయ్య, తిప్పవరం ఆనందం, అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు.

Post a Comment

Previous Post Next Post