ఎస్సి నిరుద్యోగులకు సదవకాశం.. లోన్ కు ఇలా అప్లై చేయాలి

తెలంగాణ రాష్ట్రములో షెడ్యుల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్ధిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకమైన "రాజీవ్ యువ వికాసం పథకము " ప్రకటించినది. ఈ పధకము క్రింద ఎస్.సి. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు అందించడానికి ప్రణాళికను ఆమోదించినది. కావున అర్హత మరియు ఆసక్తి గల ఎస్.సి. నిరుద్యోగ యువత రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా OBMMS ఆన్.లైన్ పోర్టల్ http://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. నమోదు ప్రక్రియ తేది: 05.04.2025 వరకు అందుబాటులో వుంటుంది. అభ్యర్థులు, పూరించిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, హార్డ్ కాపీని మరియు అవసరమైన పత్రాలను జత పరిచి మండల ప్రజాపాలన సేవా కేంద్రం (గ్రామీణ ప్రాంతాలలో MPDO కార్యాలయం) లేదా మున్సిపల్ కమిషనర్/జోనల్ కమిషనర్ కార్యాలయం (పట్టణ ప్రాంతాలు)లో సమర్పించాలి. మరిన్ని వివరాలకు జిల్లా ఎస్.సి. కార్పోరేషన్ కార్యాలయమునందు సంప్రదించగలరు.
అర్హత ప్రమాణాలు:
అవసరమైన పత్రాలు:
• ఆధార్ కార్డు.
• రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం.
• కుల ధృవీకరణ పత్రం (తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జారీ చేయబడినది).
• శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు).
• పట్టాదార్ పాస్‌ బుక్ (వ్యవసాయ పథకాలకు).
• SADAREM సర్టిఫికేట్ (PWDల కోసం).
• పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
• దుర్బల (బలహీన) సమూహ ధృవీకరణ పత్రం (మండల స్థాయి కమిటీ ధృవీకరించబడినది).
ఆదాయ పరిమితి:
• గ్రామీణ ప్రాంతాలు: సంవత్సరానికి రూ.1,50,000/-.
• పట్టణ ప్రాంతాలు: సంవత్సరానికి రూ.2,00,000/- (మునిసిపాలిటీలు, మునిసిపల్ 
   కార్పొరేషన్లు, నగర పంచాయతీలు).
• రేషన్ కార్డు వివరాలను దరఖాస్తు ఫారంలో ఇవ్వాలి మరియు రేషన్ కార్డు అందుబాటులో 
   లేని సందర్భాలలో మాత్రమే, అభ్యర్థులు “మీ-సేవ” జారీ చేసిన ఆదాయ ధృవీకరణ 
   పత్రాన్ని సమర్పించాలి.
వయోపరిమితి:
• వ్యవసాయేతర పథకాలకు 21 - 55 సంవత్సరాలు (2024 సంవత్సరం జూలై 1 నాటికి)
• వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 21 - 60 సంవత్సరాలు (2024 సంవత్సరం జూలై 1 నాటికి)
నిధుల కేటాయింపు
యూనిట్ ధర
సబ్సిడీ
బ్యాంకు లోన్
ఎకనామిక్ సపోర్ట్ స్కీములు
యూనిట్ ధర Rs.50,000/- వరకు
100%
-

యూనిట్ ధర Rs.50,0001 నుండి Rs.1,00,000/- వరకు
90%
10%

యూనిట్ ధర Rs.100,0001 నుండి Rs.2,00,000/- వరకు
80%
20%

యూనిట్ ధర Rs.200,0001 నుండి Rs.4,00,000/- వరకు
70%
30%

దుర్బల (బలహీన) సమూ హం
(Rs.1,00,000/- వరకు)
100%
(90% with 10% from EMF)
-

చిన్న నీటిపారుదల (Minor Irrigation)
100%
-

జిల్లా కలెక్టరు మరియు చైర్మన్,
జిల్లా షెడ్యూల్డ్ కులాల సహకార సంఘం లి.,
రాజన్న సిరిసిల్ల.

Post a Comment

Previous Post Next Post