రాజన్న సిరిసిల్ల జిల్ల ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గిటే మహేష్ బాబాసాహెబ్
2020 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి
రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన గిటే మహేష్ బాబాసాహెబ్ తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా నియమించబడిన గిటే మహేష్ బాబాసాహెబ్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అఖిల్ మహాజన్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టికుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని అన్నారు. శాంతి భద్రతల విషయంలోను కఠినంగా ఉంటామని చెప్పారు. ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలియజేసారు.